ఈ శతాబ్దపు సుదీర్ఘ చంద్రగ్రహణానికి కౌంట్ డౌన్ స్టార్ట్స్.. ఆర్ యు రెడీ?

ఈ శుక్రవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఏకంగా గంటా 45 నిమిషాలపాటు కొనసాగనున్న ఈ గ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా రికార్డులకెక్కనుంది. గ్రహణం సందర్భంగా చిక్కని ఎరుపు రంగులకి మారే బ్లడ్ మ్యూన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందరూ వీక్షించే అవకాశం ఉండడం విశేషం.

ఈ నెల మూడు అద్భుత ఘట్టాలకు వేదిక కావడం మరో విశేషం. ఈ నెల 13న పాక్షిక సూర్యగ్రహణం సంభవించింది. ఇది భారత్‌లో కనిపించలేదు. 27న సుదీర్ఘ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఈ నెల 31 మరో అద్భుతం జరగనుంది. 15 ఏళ్ల తర్వాత అంగారకుడు భూమికి అత్యంత చేరువగా రానున్నాడు. ఇలా మూడు ఖగోళ అద్భుతాలకు జూలై వేదిక అవుతోంది.

చంద్ర గ్రహణానికి భారత్ సెంటర్ స్టేజ్ కానుందని అమెచ్యూర్ ఆస్ట్రోనాట్ అసోసియేషన్ ఢిల్లీకి చెందిన అజయ్ తల్వార్ తెలిపారు. చంద్రుడు ఎప్పుడూ సూర్యుడు, భూమితో కచ్చితమైన అమరక ఉండకపోవడం వల్లే చాలా వరకు గ్రహణాలను చూడలేకపోతున్నట్టు తెలిపారు. భూమి సూర్యోదయం, సూర్యాస్తమయాలను 3.50 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి ఉపరితలం మీది నుంచి చూడవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ మనం కనుక చంద్రుడి మీద ఉంటే పూర్తి సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంటుదని ఆస్ట్రాలియన్ నేషనల్ యూనివర్సిటీ రీసెర్స్ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆస్ట్రానమర్ బ్రాడ్ టక్కర్ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*