పవన్ కార్లు మార్చినంత ఈజీగా భార్యలను మారుస్తాడు: జగన్

విజయవాడ: కార్లు మార్చినంత ఈజీగా పవన్‌ కల్యాణ్ పెళ్లాలను మారుస్తారని ఘాటుగా స్పందించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నిత్య పెళ్లికొడుకు అయిన పవన్ ఇప్పటికే నలుగురు భార్యలను మార్చారని జగన్ అన్నారు. పవన్ కళ్యాణ్ నైతికత.. నిజాయితీ గురించి మాట్లాడటం విడ్డూరమని జగన్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబును కాపాడాలనుకునే ప్రతీసారి పవన్ బైటకొచ్చి ఓ ట్వీటో.. ఓ ప్రెస్‌మీటో పెడతారని, ఆ తర్వాత మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతారో తెలియదని జగన్ సెటైర్ వేశారు. ఖర్మ కొద్దీ పవన్‌ లాంటోళ్లు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని జగన్ విమర్శించారు. పవన్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని అన్నారు. జనసేన అధినేతపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ స్థాయిలో కామెంట్స్ చెయ్యడం ఇదే మొదటిసారి.

మరోవైపు పవన్‌పై జగన్ వ్యాఖ్యలను టీడీపీ తప్పుబట్టింది. జగన్ అలా మాట్లాడటం సరికాదని టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*