పవన్ కాలుకు ఏమైంది?

భీమవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలు బెణికింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్రకు వెళ్ళిన పవన్ కల్యాణ్ భీమవరంలోని ఎన్.డి.ఫంక్షన్ హాల్ లో బస చేశారు. ఆయన్ను కలిసేందుకు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు ఆ ప్రాంగణానికి చేరుకున్నారు.

తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో నేల తడిగా ఉండటంతో పవన్ కాలు స్కిడ్ అయింది. ఫలితంగా పవన్ కల్యాణ్ కుడి కాలు బెణికింది. వెంటనే బ్యాండేజీతో కట్టు వేశారు. పవన్ నొప్పితో ఇబ్బందిపడ్డారు. ఆ నొప్పితోనే జన సైనికుల్ని కలిసి మాట్లాడారు. వైద్యులు వచ్చి పరీక్షించారు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడాలని చెప్పారు. కాలికి క్యాప్ వేసి స్వల్ప విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*