రువాండా పేదలకు 200 గోవులను బహుమతిగా ఇచ్చిన మోదీ

బుగ్సేరా: ఆఫ్రికాలో ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రువాండాతో భారత్ సత్సంబంధాలు కోరుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. రువాండలో పర్యటించిన మోడీ ఆ దేశం చేపట్టిన ప్రాజెక్టులకు భారత్‌ సహకారం అందిస్తుందన్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న రువాండాలోని బుగ్సేరా గ్రామస్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 200 ఆవులను బహుమతిగా ఇచ్చారు. ఆవుపాలలొ న్యూట్రిషన్ శాతం ఏక్కువగా ఉంటుంది. రువాండలోని గిరింకా ప్రాజెక్టుకు ముగ్దుడైన మోదీ బుగ్సేరా గ్రామంలోని పేదలకు ఈ ఆవులను కానుకగా ఇచ్చారు.

రువాండతో రక్షణరంగంలో సహకారానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. కిగేలీలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక ఆర్థిక మండలికి భారత్‌ 680 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. ఇది కాకుండా వ్యవసాయం రంగ అభివృద్ధికి కూడా 680 కోట్లు రూపాయలు అందించింది. పాడి, తోళ్ల పరిశ్రమ, వ్యవసాయ రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీ, రువాండా అధ్యక్షుడు పాల్‌ కగామే చర్చలు జరిపారు.

రువాండా రాజధాని కిగేలీలో భారత్‌, రువాండా పారిశ్రామిక వేత్తల సదస్సులోనూ మోడీ పాల్గొన్నారు. రువాండాలో గ్రామీణాభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని ప్రధాని తెలిపారు. భారత పారిశ్రామిక వేత్తలు ఇక్కడ వ్యాపారానికి ఉన్న అనుకూల పరిస్థితులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రువాండా వ్యాపారవేత్తలు సైతం భారత్‌ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

అంతకుముందు ప్రధాని మోడీ రువాండాలోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఎన్నారైలు ప్రపంచ దేశాల్లో తమదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. వారే భారత్‌ అసలైన రాయబారులని ప్రశంసించారు.

ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఉగాండా సహా దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. అక్కడ బ్రిక్స్ వార్షిక సమావేశంలో పాల్గొంటారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*