నానికి అంత సీన్ లేదట!

బిగ్ బాస్ సీజన్ 2లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని మొదట్లో కాస్తంత తడబడ్డా ఇప్పుడు సర్దుకున్నాడన్నది అందరూ చెబుతున్న మాట. అయితే… బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కు నాని తనదైన శైలిలో అప్పుడప్పుడూ క్లాస్ పీకుతున్నారు. దానిని జనం కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తేజస్వీ బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చే సమయంలో నాని… తన పదునైన విమర్శనాస్త్రాలను బిగ్ బాస్ హౌస్ నుండీ టర్న్ తిప్పి… నెటిజన్లను టార్గెట్ చేయడంతో కొందరికి మండుకొచ్చింది. నాని మాకు క్లాస్ పీకడం ఏమిటీ? మేం మా అభిప్రాయాలను ఎలా వెలిబుచ్చాలో నాని చెప్పాలా? అంటూ మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఇవాళ ఎవరు పడితే వారు కామెంట్స్ చేస్తున్నారు. దానిని కంట్రోల్ చేయడం, వాటిపై పబ్లిక్ గా ఆగ్రహం వ్యక్తం చేయడం అర్థం లేనిదని వారంటున్నారు. పైగా తేజస్వీ బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తించిన తీరు బట్టే నెటిజన్ల రియాక్షన్ కూడా ఉంటుందనే విషయం నాని గ్రహించాలని చెబుతున్నారు. పొట్టి బట్టలు వేసుకోవడం, అవసరానికి మించి సమ్రాట్ పై ప్రేమ కురిపించడం, కొన్ని సందర్భాలల్లో అతిగా ప్రవర్తించడం వల్లనే నెటిజన్లు ఈ రకంగా స్పందించారన్నది వాస్తవం. మరి తేజస్వి పట్ల అలాంటి అభిప్రాయం కలిగేలా వీడియో ఫుటేజ్ ను ప్రసారం చేసిన ‘బిగ్ బాస్ టీమ్’ను వదిలేసి… నెటిజన్లకు క్లాస్ పీకడం సమంజసం కాదంటున్నారు. మొత్తం మీద నాని పెద్దన్న పాత్ర పోషించడాన్ని విమర్శిస్తూ… అతగాడికి అంతసీన్ లేదని తేల్చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*