నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ వీర భోగ వసంత రాయలు’.. రేపు నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా అయన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం..పోస్టర్ లో ‘ హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని పిలుస్తుండడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.. చిత్రంలోని ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. మెనాసింగ్ కల్ట్ లుక్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ లో నారా రోహిత్ చాల సీరియస్ గా తన హావభావాలను కనపరుస్తూ సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ ని కలగజేస్తున్నాడు..ఎంతో వైవిధ్యంగా, కొత్తగా సినిమా ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ ని , ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పెంచుతున్నారు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ శరన్, శ్రీ విష్ణు , సుధీర్ బాబు లు ముఖ్య పాత్రల్లో నటించారు.. మార్క్ కే రాబిన్ సంగీతం వహించారు..
తారాగణం :
నారా రోహిత్, శ్రీయా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు ఇతరులు
హైదరాబాద్: రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. శీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కాన్సెప్ట్ పోస్టర్ ని చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఓ ఉంగరం.. రాజు రాణి బొమ్మలు టైటిల్ లో కనిపిస్తున్నాయి. ఇది చాలా కొత్తగా [ READ …]
నారా రోహిత్, కృతిక , నీలమ్ ఉపాధ్యాయ హీరో హీరోయిన్లుగా శ్రీ శంఖు చక్ర ఫిలింస్ పతాకంపై కార్తికేయను దర్శకుడుగా పరిచయం చేస్తూ కోటి తూముల నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం`2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కోటి [ READ …]
Be the first to comment