కేటీఆర్‌కు రేవంత్ సవాల్!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరినట్టు ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో కాదు తనతో ఫీల్డ్‌లో తనతో పోటీ పడాలని ఛాలెంజ్ చేశారు. రాజకీయాల్లోనే కాదు కేటీఆర్ తనతో ఏ ఆటలోనూ పోటీ పడలేరని అన్నారు.

రేవంత్ తన పోస్టింగ్‌కు జతగా ఫుట్‌బాల్ అడుతున్న ఫోటోలను జత చేశారు. అందులో ఆయన బ్లాక్ బనియన్, బ్లాక్ ఫ్యాంట్, బ్లాక్ షూ దరించి ఫుట్‌బాల్‌ను తన్నుతున్నారు. మధ్యలో నిలబడి తనతో కలిసి ఆడుతున్న వారి అందరితో కలిసి గ్రూప్ ఫొటో కూడా రేవంత్ దిగారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా అయిన ఈ పోస్ట్‌లో రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ట్యాగ్ చేశారు.

 

హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ అంటూ దేశంలో బాగా పాపులర్ అయిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి విసిరారన్నమాట. కేటీఆర్‌తో పాటు రాహుల్ గాంధీ పేరును కూడా ట్యాగ్ చేశారు. ఇంకా ఎన్టీవీ, ఏబీఎన్, టీవీ5, టీవీ9 పేర్లను కూడా రేవంత్ ట్యాగ్ చేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*