మహా సంప్రోక్షణ సమయంలో సిఫారసు లేఖలు తీసుకోం- టీటీడీ

తిరుమల: ఆగస్టు 11 నుంచి 16 వరకు జరగ నున్న మహాసంప్రోక్షణ కార్యక్రమ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈనెల 11న 9గంటలు, 12న 4 గంటలు,13న 4 గంటలు, 14న 6 గంటలు, 15న 5 గంటలు, 16న 4 గంటలు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని తీర్మానించింది. కేవలం సర్వదర్శన భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించమని స్పష్టం చేసింది.

పదవి విరమణ పొందిన మిరాశీ అర్చకులకు 20లక్షలు, ప్రధాన అర్చకులకు 30 లక్షల చొప్పున ఏకకాలంలో సొమ్మును అందించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుమలలోని ఎఫ్.టైప్ క్వార్టర్స్ ను 7 కోట్లతో ఆధునికరించి భక్తులకు కేటాయించాలని పాలకమండలి ఏకాభిప్రాయానికి వచ్చింది.

తిరుపతిలోని అవిలాల చెరువును ఆధ్యాత్మిక, పర్యావరణ రక్షిత కోసం 11 కోట్ల రూపాయలతో టెండర్ పిలవాలని మరో తీర్మానం చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఖాళీగా ఉన్న 2 అర్చకుల పోస్టు నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా కీలపట్ల కొనేటిరాయస్వామి దేవాలయంలో శుక్రవారపు సేవగా అభిషేకసేవ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న పాలకమండలి…సేవా టిక్కెట్టు ధరను 300 రూపాయలుగా ఖరారు చేసింది. 23కోట్లతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ ప్రాంతం, 10కోట్లతో ఎంబీసీ నుంచి వైకుంఠం క్యూకాంప్లెక్స్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

తిరుచానూరు పద్మావతి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు ఏర్పాట్లు చేయాలని మరో నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 7నుంచి 7.30 వరకు విఐపి భక్తులను అనుమతి, ఒక్కో టిక్కెట్టు 500రూపాయల చొప్పున విక్రయించాలని పాలకమండలి డెసిషన్ తీసుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*