
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి భాగస్వాములయ్యారు. బంజారాహిల్స్ ఆస్కిలో నేడు నిర్వహించిన హరితహారంలో తాను స్వయంగా మూడు మొక్కలను నాటడంతో పాటు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లయిన భారతీహోలీకేరి, ముషారఫ్ అలీ, భాస్కరాచారిలకు గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. అర్భన్ కమ్యునిటీ డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారికి గ్రీన్ ఛాలెంజ్ విసురుతూ తన ఆదీనంలోని 45 వేల స్వయం సహాయక బృందాల మహిళలతోనూ మొక్కలు నాటించాలని కోరారు. అదేవిధంగా, డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారులతోనూ, ముషారఫ్ అలీ కూడా తమ ఆధీనంలోని విభాగాల అధికారులు సిబ్బందితోనూ మొక్కలు నాటించాలని సూచించారు.
Be the first to comment