తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక
ప్రధాన పాత్రలో నటించగా సన్సేషనల్ డైరెక్టర్ బాల స్వయ దర్శకత్వం నిర్మించబడిన ఈ చిత్రం తెలుగు లో కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి తెలుగు టీజర్ ను సమ్మోహనం చిత్రం తో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేసారు.
అయన టీజర్ చూసి “టీజర్ చాల బాగుంది, జ్యోతిక గారిని పోలీస్ ఆఫీసర్ గా చూస్తుంటే వారి శ్రీవారు సూర్య గారు గుర్తుకొస్తున్నారు. పోలీస్ సినిమా అంటేనే సూర్య గారు గుర్తుకు వస్తారు. ఇప్పుడు వారి సతీమణి జ్యోతిక గారు పోలీస్ ఆఫీసర్ గా సినిమా చేయటం చాల ఆనందం గా ఉంది. తమిళం లో ఈ చిత్రం బారి విజయం సాధించింది ఇప్పుడు తెలుగు లో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో మన ముందుకు వస్తుంది. టీజర్ చూసాక సినిమా ఖచ్చితంగా చూడాలి అని అనిపిస్తుంది. తెలుగు లో విడుదల చేస్తున్న నిర్మాతలు కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ గారికి అల్ ది బెస్ట్” అని అన్నారు.
జ్యోతిక టెర్రిఫిక్ పర్ఫార్మ్యాన్స్, జివి.ప్రకాష్ అద్భుతమైన నటన మరియు ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రం సక్సెస్ కి ప్రధారణ కారణం.
ఇంత భారీ సక్సెస్ ని అందుకున్న నాచియార్ మూవీ ఇప్పుడు తెలుగులో మరిన్ని సంచనాలు తెరలేపటానికి వస్తుంది. తెలుగులోకి వస్తున్న ఈ మూవీకి ఇప్పటికే మార్కెట్ వర్గాల నుండి పోటా పోటీ బిసినెస్ జరుగుతుంది. త్వరలోనే విడుదల అవుతుంది.
మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచీస్కున్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి సినిమాకూ దర్శకుడు మారుతూ ఉండటమే. ఈ వరుసలో ఒక్కో సినిమాకు, ఒక్కో దర్శకుడు పనిచేయడాన్ని గమనించవచ్చు. ఈ సారి హీరో టామ్ క్రూయిస్ `మిషన్ఇంపాజిబుల్ – ఫాలౌట్`కోసం తనకిష్టమైన దర్శకుడు మెక్ క్వారీని ఎంపిక చేసుకున్నారు. వీరిద్దరి కలయికలతో రూపొందిన రెండో సినిమా ఇది. ఈ నెల 27న విడుదల కానున్న `మిషన్ ఇంపాజిబుల్ – ఫాలౌట్` గురించి మెక్ క్వారీ మాట్లాడుతూ “నన్ను టామ్ కలిసి `మిషన్ ఇంపాజిబుల్ – ఫాలౌట్`ను దర్శకత్వం చేయమని అడిగినప్పుడు నేను ఆయనతో ఒకటే చెప్పా. ఇంతకు మునుపు సినిమాలకన్నా ఈ సినిమాలో దృశ్యపరంగా పెద్ద మార్పు తీసుకునివస్తాను అని. గత చిత్రాలను చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మరొకరు అని ఇట్టే తెలియాలన్నది నా ఫీలింగ్“ అని చెప్పారు. టామ్ క్రూయిస్ మాట్లాడుతూ “నేను 2012లో మెక్ క్వారీతో యాక్షన్ థ్రిల్లర్ `జాక్ రీచర్` చేశాను. ఆయనతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. అత్యద్భుతమైన ప్రతిభావంతుడు. మా `మిషన్ ఇంపాజిబుల్ – ఫాలౌట్`లో విజువల్ స్టైల్లోమార్పులు చేయాలనుకున్నారు. అంతకు మునుపు ఇంకెవరో చేసినదే అయినా, ఆయన తన మార్కు ఉండాలనుకున్నారు. అనుకున్న ప్రకారమే విజయాన్ని సాధించారు. ఇందులో ఆయన బోల్డ్ స్టోరీ టెల్లింగ్ విధానాన్ని గమనించవచ్చు. ఈసినిమాలో కథలోని క్లిష్టత, పాత్రల తీరుతెన్నులు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదలకు సిద్ధమయ్యాం. ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అనే ఆకాంక్షతో ఉన్నాను“ అని అన్నారు. పారామౌంట్ పిక్చర్స్ తెరకెక్కించిన `మిషన్ ఇంపాజిబుల్ – ఫాలౌట్` ఈ నెల 27న విడుదల కానుంది. ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగులో విడుదల చేయనుంది.
అగ్రహారం: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం అగ్రహారం దగ్గర క్వారీలో బ్లాస్టింగ్ పనులు చేస్తుండగా బండరాళ్లు మీద పడి 12 మంది కూలీలు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒడిశా వాసులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుళ్ల ధాటికి ఇళ్లు కూలిపోయాయి. [ READ …]
కామారెడ్డి జిల్లాలోని అర్ష గురుకుల విద్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందరో విశిష్టమైన వ్యక్తులు ఇక్కడ విద్య నేర్చుకున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ మూడు దశాబ్దాల కిందట అర్ష గురుకులంలోనే యోగ శాస్ర్తాన్ని అభ్యసించారు. అంతేకాదు స్వామి పరిపూర్ణానంద కూడా ఇక్కడ తొమ్మిది నెలల [ READ …]
Be the first to comment