జగన్ వ్యాఖ్యలపై పవన్ ట్వీట్..

భీమవరం: నలుగురు పెళ్లాలున్న నిత్యపెళ్లికొడుకు విలువల గురించి మాట్లాడటం, తనను అవినీతిపరుడని విమర్శించడం తగదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన పవన్ తాను 25 ఏళ్లలో 25 కోట్ల రూపాయల పన్ను కట్టానని, మూడేళ్లలో జగన్ మూడొందల కోట్లు ఎలా కట్టగలిగారని ప్రశ్నించారు. ఫ్యాక్షనిస్టులపై ఉప్పెనలా దాడి చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు తాను చూడటానికి మెతకగానే కనిపిస్తానని, తేడా వస్తే తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చారు. దోపిడీలకు పాల్పడే నేతలకే అంత ఉంటే ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న తనకెంత ఉండాలంటూ పవన్ ప్రశ్నించారు.

పవన్‌ భార్యల గురించి జగన్ కామెంట్ చేశాక సోషల్ మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో పవన్ ట్వీట్ చేశారు. జగన్ తనను విమర్శించడంతో చాలా మంది బాధపడ్డారని తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే తాను ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను రాజకీయ లబ్దికోసం వాడుకోనన్నారు. ప్రజలకు సంబంధించిన విషయాలపైనే మాట్లాడతానని, ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని పవన్ స్పష్టం చేశారు. జగన్‌ను కానీ ఆయన కుటుంబసభ్యులను కానీ, ఆయన ఇంటి ఆడపడుచులను కానీ వివాదంలోకి లాగవద్దంటూ పవన్ తన ఫ్యాన్స్‌కు సూచించారు. ఈ వివాదాన్ని దయచేసి అందరూ ఇక్కడితే ఆపివేయాలని పవన్ సూచించారు.

అంతకు ముందు జగన్ ఏపీ బంద్ నిర్వహించిన రోజున సామార్లకోటలో విలేకరుల సమావేశంలో పవన్‌పై విరుచుకుపడ్డారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*