
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోయాడు. 25 సంవత్సరాల మౌలిన్ రాథోడ్ అనే యువకుడు ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువతి దగ్గరికి వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎమర్జెన్సీ సర్వీస్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాథోడ్ ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడు.
డేటింగ్ కోసం పిలిచిన అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాథోడ్ మృతదేహాన్ని అతని స్వస్థలమైన అహ్మదాబాద్ తరలించేందుకు ఇండియన్ ఎంబసీ ఏర్పాట్లు చేస్తోంది.
Be the first to comment