
ముంబై: టైటిల్ చూసి షాకయ్యారా? ఏమీ లేదు. విషయం ఏంటంటే.. శ్రీదేవి కూతురు జాహ్నవి నటించిన ధడ్కన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దివికేగిన అందాల తారను మళ్లీ వెండితెర మీద చూసినట్టుందని ప్రశంసలు దక్కుతున్నాయి.
షబానా అజ్మీ అయితే జాహ్నవిని ఏకంగా ఆకాశానికెత్తేసింది. మీకు తెలియకుండా మీ కూతురు పాతిక ముప్పై సినిమాలు గానీ చేసిందా అని బోనీకపూర్ తో అన్నదట. అంటే స్క్రీన్ మీద అంత పాలిష్డ్ గా కనిపిస్తోంది అని తెగ మెచ్చుకుందట. సినిమా చూసి రేఖ అయితే ఏకంగా కంటనీరే పెట్టుకుందని బోనీ చెప్పుకొచ్చాడు.
Be the first to comment