బీబీసీకి ఇమ్రాన్ ఖాన్ కూడా తెలియదా?

 

ఎలక్ట్రానిక్ మీడియా అన్నాక రోజులో ఒకటీ అరా తప్పులు దొర్లడం సహజం. వెంటవెంటనే దిద్దుకుంటూ ముందుకు వెళ్లడం రివాజు. కానీ కొన్ని సందర్భాల్లో జరిగిన మిస్టేక్ నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. అలాంటి తప్పులోనే కాలేసింది బీబీసీ న్యూస్ నైట్. పాకిస్తాన్ ఎన్నికల కవరేజీలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ బదులు వసీం అక్రం క్రికెట్ ఆడే క్లిప్పింగ్ వేశారు. అంతటితో ఆగలేదు. విజువల్స్ అక్రంవి, కెరీర్ గురించి డిస్క్రిప్షన్ మాత్రం ఇమ్రాన్‌ ది. ఇంకేముంది సెటైర్లు బీభత్సంగా పడ్డాయి. ఇమ్రాన్ అధ్యక్షుడు అవుతున్న వేళ అక్రం బౌలింగ్ వేసి వికెట్ తీస్తాడు అని యూజర్లు జోకులేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*