కరుణ ఇంటికి నేతల క్యూ

చెన్నై: అస్వస్థతకు గురైన డీఎంకే అధినేత కరుణానిధి నివాసానికి రాజకీయ నేతలు క్యూ కట్టారు. కలైంజర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కరుణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్న కరుణకు ఆయన ఇంటి వద్దే వైద్యసేవలు అందుతున్నాయి. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులు, రాజకీయ నేతలు కరుణ నివాసానికి వచ్చారు. 94 సంవత్సరాల కరుణానిధి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*