సామాన్యుడికి అర్ధమయితేనే టెక్నాలజీకి సార్ధకత

సామాన్యుడికి చేరువకాని సాంకేతిక పరిజ్ఞానం నిరుపయోగమన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు టీ-శాట్, ఉన్నత విద్యాశాఖ కలసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలన్నారు. టీ శాట్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టీ-శాట్ మధ్యతరగతి నిరుద్యోగ అభ్యర్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని మంత్రి కేటీఆర్ కొనియాడారు.

 

పోటీపరీక్షల విషయంలో టీ-శాట్ సేవలు మంచి ఆదరణ పొందాయన్నారు మంత్రి కేటీఆర్. పోటీ పరీక్షల ప్రకటన వెలువడగానే టీ-శాట్ ప్రసారాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు టీ-శాట్, ఉన్నత విద్యాశాఖ కలసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. టీశాట్ రెండు లక్షల సబ్ స్రైబ్స్, 31 మిలియన్ల వీవ్స్ తో సంతృప్తి చెందకుండా ప్రయివేటు సంస్థలకు పోటీగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. విప్లవాత్మక ఆలోచనలతో టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్లను ముందుకు నడుపుతున్నారని సీఈవో శైలేష్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*