
మూసీనది అభివృద్ధి, సుందరీకరణ, ప్రణాళికలపై మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. మూసినది సుందరీకరణ తాలూకు డిజైన్లను పలు అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ సంస్థలు తయారు చేస్తున్నారని అధికారులు మంత్రికి తెలియజేశారు. డిజైన్లతో పాటు అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకుపోతూనే, ప్రస్తుతం మూసీనదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఈమేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోపాటు జిహెచ్ఎంసి కలిసి మూసి నది ఒడ్డున ఉన్న అక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అనేక సంవత్సరాలుగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకి సరైన విధంగా పునరావాసం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఒక నివేదికను తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జీవనాధారం కోసం మూసి ఒడ్డున తాత్కాలిక గృహాల్లో నివసిస్తున్న పేదలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాంబే, జెఎన్ఎన్ యూఅర్ఎం ఇళ్లలో పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవైపు ప్రస్తుతం ఉన్న మూసి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడుకోవడడానికి గుర్తించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు బల్దియా అధికారులు నిరంతరం నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
Be the first to comment