ప్రభుత్వ పారా మెడికల్ కోర్సులో కాలేజీలు, సీట్ల వివరాలు

పారా మెడికల్ కోర్సుల్లో సీట్లు పెంచడమేగాక, మరిన్ని కొత్త కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెంచిన, కొత్తగా ప్రకటించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్లకు తెలంగాణ పారా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు, తరగతుల ప్రారంభ తేదీలను ప్రకటించింది. పెరిగిన, కొత్త సీట్లు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
పారా మెడికల్ డిప్లొమా రెండేళ్ల కోర్సులు-సీట్ల వివరాలు:
డిప్లమా ఇన్ డెంటల్ హైజీనిస్ట్ (40)
డెంటల్ టెక్నీషియన్ (40)
డయాలిసిస్ టెక్నీషియన్ (30)
రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ (120)
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (80)
మెడికల్ స్టెర్లైజేషన్ టెక్నీషియన్ (90)
ఎమర్జెన్సీ పారామెడికల్ టెక్నీషియన్ (90)
మైక్రో సర్జరీ టెక్నీషియన్ (10)
ఆడియోమెట్రీ టెక్నీషియన్ (40)
హియరింగ్ ల్యాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరిపీ (40)
హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ అండ్ మేనేజ్మెంట్ (10)
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (10)
ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (10)
మొత్తం 610 సీట్లు

పాత పారా మెడికల్ కోర్సుల్లో పెరిగిన సీట్ల వివరాలు:
మెడికల్ ల్యాబ్ టెక్నీషయన్ (80)
ఆప్టోమెట్రి టెక్నీషియన్ (13)
ఆప్తాల్మిక్ అసిస్టెంట్ (58)
రేడియో థెరపటీ టెక్నీషియన్ (20)
డయాలిసిస్ టెక్నీషియన్ (30)
మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (70)
మెడికల్ స్టెర్లైజేషన్ టెక్నీషియన్ (10)
అనెస్టీషియా టెక్నీషియన్ (70)
రేడియో గ్రఫీ అసిస్టెంట్ (10)
మొత్తం 361 సీట్లు

 

సీట్లన్నీ, ఉస్మానియా, కాకతీయ, గాంధీ, ప్రభుత్వ మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీ, ఇఎన్టి హాస్పిటల్, ఎం.ఎన్.జె క్యాన్సర్ హాస్పిటల్, ప్రభుత్వ చెస్ట్ హాస్పిటళ్లకు కేటాయించారు. ప్రభుత్వ కాలేజీల్లో పారా మెడికల్ కోర్సుల దరఖాస్తులకు ఆగస్టు 8వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పారా మెడికల్ బోర్డు కార్యదర్శి గోపాల్రెడ్డి తెలిపారు. ప్రైవేట్ కాలేజీలకు కూడా దరఖాస్తుల గడువుని ఆగస్టు 13వ తేదీ వరకు పొడగించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*