పోలీస్ అయివుండి దొంగతనం చేసింది!!

దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనాలకు పాల్పడితే డిపార్టుమెంటుకు ఎంత తలవొంపులు. చెన్నైలో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ సూపర్ మార్కెట్లోకి వచ్చిన ఓ లేడీ కానిస్టేబుల్ తనకు కావాల్సిన వస్తువుల్ని దర్జాగా పట్టుకెళ్లబోయి పట్టుబడింది. ఆమె తస్కరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో గమనించిన ఓ సేల్స్ మేన్ ఆమె గడపదాటేలోపే దొరకబట్టుకున్నాడు. సీన్ రివర్స్ కావడంతో కానిస్టేబుల్ నోట మాట రాలేదు. దొరికిపోయిందన్న అక్కసుతో, కాసేపటి తర్వాత తన భర్త మరికొందరిని వెంటబెట్టుకుని వచ్చి షాప్ మీద దాడి చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*