సాకర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో ఫిట్ నెస్ సీక్రెట్ ఇంట్రస్టింగ్

క్రిస్టియానో రోనాల్డో…క్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు..15 ఏళ్లుగా కోట్లాది క్రీడాభిమానులను అలరిస్తున్న ఫుట్ బాల్ ఆటగాడు. 33 ఏళ్ల వయసులోనూ సంచలనాల మోత మోగిస్తున్న పోర్చుగీస్ ప్లేయర్. ఏళ్ల తరబడి వరల్డ్ సాకర్ లో మిరకిల్స్ చేస్తున్న రోనాల్డో తాజాగా ముగిసిన వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు. ఆరంభ మ్యాచ్ లోనే హ్యాట్రిక్ గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ లిస్టులో టాప్ ఫైవ్ లో నిలిచాడు. 9 ఏళ్ల పాటు ఫేమస్ క్లబ్ రియల్ మ్యాడ్రిడ్ కు సేవలందించిన రోనాల్డో.. ఈ మధ్యే కళ్లు చెదిరే రేటుకు జువంటస్ క్లబ్ కు మారాడు.

సాకర్ వరల్డ్ లో ఇప్పుడు రోనాల్డో ఫిట్ నెస్ హాట్ టాపిక్.. ఫిట్ నెస్ ఫ్రీక్ గేమైన సాకర్ లో 15 ఏళ్ల పాటు ఎన్నో వందల కిలో మీటర్లు పరిగెత్తిన రోనాల్డో.. అలుపేరుగని ఆటగాడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. అతని ఫిట్ నెస్ పై ప్రత్యేకంగా ఆధ్యాయనం చేసిన అతని కొత్త క్లబ్ జువంటస్ మెడికల్ ఎక్స్ ఫర్ట్స్ సైతం విస్తుపోయేలా అతని ఫిట్ నెస్ లేవల్స్ ఉన్నాయి.. 33 ఏళ్ల వయసులో అతని బాడీ ఫిట్ నెస్ 20 ఏళ్ల యువకుడి కంటే బాగుందని అని నిపుణులు తేల్చేసారు. మరో పదేళ్ల పాటు రోనాల్డో సాకర్ లో కొనసాగడం ఖాయమని సర్టిఫైడ్ చేశారు.

జూనియర్ స్థాయి నుంచి ఇప్పటికే దాదాపు గా అన్ని లీగుల్లో కలిపి వేయికి పైగా మ్యాచ్ లాడిన రోనాల్డో.. మైదానంలో అతని కవర్ చేసిన డిస్టెన్స్ చూస్తే గుడ్లు తేలేయాల్సిందే.. స్టార్ ప్లేయర్ గా ఆట ఆరంభం నుంచి చివరి వరకు పూర్తి టైమ్ గ్రౌండ్ లోనే గడిపే రోనాల్డో.. ఇప్పటికే వేల కిలో మీటర్లు పరిగెత్తాడు. అయినా అతని కెరీర్ లో మేజర్ ఇంజూరీ లేదు. లాంగ్ టైమ్ ఆటకు దూరమైన సందర్భం లేదు. ఇక అనితర సాధ్యం కాని డ్రిబ్లింగ్ తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే రోనాల్డో.. 105 మీటర్ల పిచ్ ను కొన్ని సెకన్లలోనే కవర్ చేయగలడు. మైదానం లో అతని స్పీడ్ గంటకు 35.48 కిలోమీటర్ల వేగం.. ఇదే ఇప్పటి వరకు ఫుట్ బాల్ హిస్టరీలో అత్యుత్తమగా స్పీడ్ గా నిలిచింది. దీంతో పాటు అతని కిక్ లో పవర్ సైతం మిగితా ప్లేయర్ల కంటే ఎంతో ఎక్కువ.. అద్భుతమైన హెడర్స్ తో గోల్స్ కొట్టే రోనాల్డో మెంటల్ ఎబిలిటీ సైతం మాక్సిమమ్ ఉందని నిపుణులు తేల్చారు. దీంతో పాటు ప్రి కిక్ టైమ్ లో అతడు కొట్టే హై పవర్ కిక్ ను అడ్డుకోవడం గోల్ కీపర్లకు పెద్ద సవాలే.. అటు పెనాల్టీ కిక్ లో సైతం అతని హై కో ఆర్డినేషన్ మిరకిల్.. అందుకే వరల్డ్ లోనే బెస్ట్ పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ ఇప్పుడు..అప్పుడు ఎప్పుడు రోనాల్డో నే ది బెస్ట్..

 

ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టే రోనాల్డో ప్రతి రోజు గంటల కొద్ది జిమ్ లో కసరత్తులు చేస్తుంటాడు. దీంతో పాటు ప్రత్యేకమైన డైట్ మెయింటెన్ చేస్తుంటాడు. సాకర్ ప్లేయర్లకు కావాల్సిన లెగ్ ఎక్సైర్ సైజ్ లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. బలవర్థకమైన పౌష్టికాహారం తీసుకుంటాడు. అయితే ఈ మధ్యే రోనాల్డో వర్కౌట్ టైమ్ టేబుల్ మార్చాడు. వారంలో ఐదు రోజులు ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు.. కనీసం 5 గంటల పాటు జిమ్ లో వర్కవుట్ చేస్తాడు. ప్రతి రోజు ఒక్కో పార్టుపై దృష్టి సారిస్తాడు. మంగళవారం, శుక్రవారం జిమ్ కు దూరంగా ఉంటాడు.

 

వరల్డ్ కప్ లో వ్యక్తిగతంగా రాణించిన తన జట్టు పోర్చుగల్ కు కప్ అందించలేకపోయిన రోనాల్డో ఇప్పట్లో రిటైర్ మెంట్ ఆలోచన లేదని కుండబద్దలు కొట్టాడు. తన శరీరం సహకరించినంత వరకు ఆడుతూనే ఉంటానని స్పష్టం చేశాడు. తాజా ఫిట్ నెస్ టెస్ట్ లో అతని సత్తా చూసిన తర్వాత మరో పదేళ్ల పాటు రోనాల్డో కెరీర్ కొనసాగడం ఖాయమని సాకర్ అభిమానులు సంబరపడుతున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*