గ్రీన్ ఛాలెంజ్ విసిరిన కలెక్టర్ ఆమ్రపాలి

వరంగల్ అర్బన్: హరిత హారం కార్యక్రమంలో భాగంగా వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మొక్కలు నాటారు. వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్‌తో పాటు అర్బన్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగస్తులు, యువత మరియు విద్యార్థులందరికీ మూడేసి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

ప్రతి ఒక్కరూ ఛాలెంజ్‌ను స్వీకరించి మూడేసి మొక్కలు నాటి మరో ముగ్గురికి మూడేసి మొక్కలు నాటేందుకు ఛాలెంజ్ విసరాలని కలెక్టర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు.

వాస్తవానికి ఈ ఛాలెంజ్‌ను నిజామాబాద్ ఎంపీ కే.కవిత ప్రారంభించారు. దీనికి అన్నివర్గాల నుంచీ అనూహ్య స్పందన వస్తోంది. రాజమౌళి నుంచి సైనా నెహ్వాల్ దాకా అంతా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా అంతా ఈ హరిత హారం కార్యక్రమంలో భాగమయ్యారు.

తాజాగా కవిత సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఈ రక్షాబంధన్‌ వేళ సోదరులకు హెల్మెట్ బహుకరించాలనే కార్యక్రమం ప్రారంభించారు. దీనికి కూడా అనూహ్య స్పందన వస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*