
ఇదేమిటీ వీరిద్దరూ కలిసి ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా చేస్తున్నారు కదా… వీళ్ళిద్దరి మధ్య వైరం ఏమిటీ అని అనుకుంటున్నారా! ఇది నిజం… ఎలాగంటే ఇక్కడో చిన్న మెలిక ఉంది.
వచ్చే ఆగస్ట్ 3న వీరిద్దరూ పరోక్షంగా బాక్సాఫీస్ బరిలో పోటీ పడబోతున్నారు. మారుతీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘బ్రాండ్ బాబు’ సినిమా ఆగస్ట్ 3న రిలీజ్ అవుతోంది. దీనికి మారుతీనే కథ, మాటలు కూడా అందించాడు.
ఈ నెల 27న విడుదల కావాల్సిన సుశాంత్ ‘చి.ల.సౌ’ చిత్రం వాయిదా పడి… ఆగస్ట్ 3నే జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా విడుదలను అన్నపూర్ణ స్టూడియోస్ భుజానికి ఎత్తుకోవడంతో దానిని ప్రమోట్ చేసే పని నాగచైతన్య, సమంత చేపట్టారు. ఈ సినిమాతో సుశాంత్ కు మంచి హిట్ ఇవ్వాలని వీరు అక్కినేని ఫ్యామిలీ హీరోలు తాపత్రయడుతున్నారు. దాంతో పరోక్షంగా మారుతీ… నాగచైతన్య సినిమాలు పరోక్షంగా ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి.
Be the first to comment