బుల్ రంకె వేసింది.. మార్కెట్ సర్రున లేచింది

స్టాక్ మార్కెట్లో బుల్ రంకె వేసింది. దలాల్ స్ట్రీట్ రికార్డుల జోరుతో దద్దరిల్లింది. కంపెనీల ఫస్ట్ కార్టర్స్ రిజల్ట్స్ అంచనాలను మించడంతో స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సీరీస్ ప్రారంభమైన తొలిరోజునే దూకుడు ప్రదర్శించిన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ లోనూ దుమ్ము రేపాయి. ఇంట్రాడే, క్లోజింగ్ లోనూ లైఫ్ టైం హై మార్కు సాధించాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 37వే మైలురాయిని దాటింది.

 

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు పెరగడం, రూపాయి మరింత బలపడడం మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. దీంతో మెటల్, FMCG, ఆటోమొబైల్ షేర్ల కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఉదయం 200 పాయింట్ల లాభంతో 37వేల 254 పాయింట్ల వద్ద ప్రారంభమైన ట్రేడింగ్లో.. ఆరంభంలో నమోదు చేసిన 37వేల 135 పాయింట్లు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. కొనుగోళ్ల జోరుతో ఒక దశలో 37వేల 369పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదుచేసిన సెన్సెక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 352 పాయింట్ల లాభంతో 37వేల 337పాయింట్ల వద్ద క్లోజయింది. ఐటీసీ, టాటా మోటార్స్, ఐఓసీ, హిందాల్కో, టైటాన్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. నిఫ్టీ సైతం భారీగా లాభపడింది. 111 పాయింట్లు గెయిన్ చేసి 11వేల 278 పాయింట్ల వద్ద క్లోజయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*