
కీర్తి సురేష్ ఎంత మంచి నటో ‘మహానటి’ సినిమా నిరూపించింది. ఈ సినిమా తరువాత కీర్తి పేరు బాగా మారుమోగిపోయింది. ఆమె చాలా బిజీ అయిపోయి ఆఫర్లు వరుసపెట్టి తన్నుకొచ్చాయి. అవన్నీ ఒప్పుకుని ఉంటే కీర్తి అంత బిజీ హీరోయిన్ దక్షిణాదిన మరొకరు ఉండేవారు కాదు.
కానీ కీర్తి అవన్నీ ఒప్పుకోవడం లేదట! కథలు నచ్చుతున్నప్పటికీ తనని లిప్‌లాక్ సీన్ చేయాలని అడుగుతున్నారట! లిప్‌లాక్‌లకు దూరమని తాను ఏనాడో స్పష్టం చేసినా తన దగ్గరకు వచ్చిన కథలలో లిప్‌లాక్ సీన్లు తప్పకుండా ఉంటున్నాయనీ, సినిమాలు ఒప్పుకోవాలంటే ఇవే అడ్డు అవుతున్నాయని కీర్తి సురేష్ వాపోతోందట.
Be the first to comment