ఖగోళంలో అద్భుతం.. మళ్లీ వందేళ్ల తర్వాతే ఇలాంటి అరుదైన దృశ్యం

హైదరాబాద్: ఖగోళంలో అద్భుతం జరగనుంది. 1700 ఏళ్ల తర్వాత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ముదురు ఎరుపు రంగులో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. తెల్లవారుజామున 3:49 వరకూ పాక్షిక చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఉత్తరఅమెరికా, ఆర్కిటిక్, ఫసిపిక్ ప్రాంతాలు మినహా అన్ని దేశాల్లో గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. మళ్లీ 2123 జూన్ 9న ఖగోళంలో ఈ అద్భుతం జరుగుతుందని, కాబట్టి నేటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీకాళహస్తి ఆలయం మినహా అన్ని దేవాలయాలూ మూసివేశారు. శనివారం ఉదయం 4:15కు తిరుమల ఆలయం తెరుస్తారు. ఉదయం 4 గంటల నుంచి కంపార్ట్‌మెంట్‌లలోకి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 7 నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*