జగన్‌పై నిప్పులు చెరిగిన పవన్

భీమవరం: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబును ఎదుర్కోలేకే జగన్ అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు.. దమ్ము, ధైర్యంజగన్‌కు లేవన్నారు. జగన్ స్థానంలో తానుంటే ప్రభుత్వాన్ని ఊపు ఊపేవాడినన్నారు.

జగన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్నారని.. తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తాను ఏదీ దాచలేదని, కానీ చాలా మంది జీవితాల్లో కనిపించని పేజీలు ఉంటాయని అన్నారు. తన జీవితంపై విమర్శలు చేసే వారికన్నా.. అన్ని కోణాల్లో తను బెటర్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయాలంటే చాలా చేయగలనని, తట్టుకోలేనంతగా చేయగలనని పవన్ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*