
కన్నుకొట్టి రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్నూ, కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మలయాళీ నటి ప్రియావారియర్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందట! ఆమె బాగా పాపులర్ అయిన సమయంలో ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని చాలామంది దర్శకనిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు.
కానీ సినిమాలు, నటన కన్నా చదువుకే ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రియా వారి ఆఫర్లను తిరస్కరించింది. అయితే ఆమె చదువుకు అడ్డంకి కాదని భావించి వాణిజ్య ప్రకటనలకు ఓకె చెప్పింది. అందుకు కోటి రూపాయలు అడిగింది. గతంలో ఆమెకు వచ్చిన పేరు దృష్ట్యా అంత ఇవ్వడానికి ఆ కంపెనీ ముందు సంసిద్ధత వ్యక్తం చేసినా, ఆ తరువాత ఆలోచనలో పడిందట!
దీంతో ఆ ప్రకటన ప్రియా చేస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకటనకు సంబంధించి షూటింగ్ మొదలైందని కొందరు, ఇంకా మొదలు కాలేదనీ కొందరు అంటున్నారు. నిజనిజాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే! వాణిజ్య ప్రకటనల్లో మెరవాలన్న ప్రియా ఆశలు నెరవేరకపోవచ్చని కొందరు అంటున్నారు. మొత్తానికి ఆమె కెరీయర్ అయోమయంలో పడినట్టేనా!
Be the first to comment