
పోర్న్‌స్టార్ అయిన సన్నీ లియోన్ జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే! పోర్న్‌స్టార్ నుంచి స్టార్‌గా మారడానికి ఆమె పడిన కష్టం, బాలీవుడ్‌కి రాకముందు ఆమె జీవితం తదితర విశేషాలనీ ఈ వెబ్ సీరిస్‌లో ఉంటాయి. ఈ సిరీస్ పేరు ‘కరంజిత్ కౌర్-ది అన్ టోల్డ్ స్టోరీ అఫ్ సన్నీ’. సరిగ్గా టైటిల్ దగ్గరే దెబ్బ పడింది. టైటిల్లో కౌర్ అన్న పదాన్ని వాడడాన్ని సిక్కు గురుద్వార్ మేనేజ్మెంట్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
టైటిల్ నుంచి కౌర్ అన్న పదాన్ని తొలగించాలని ఆ కమిటీ డిమాండ్ చేస్తోంది. అదే టైటిల్‌తో ట్రయలర్లు విడుదలైన తరువాత వచ్చిన ఈ కొత్త చిక్కుతో దీన్ని రూపొందిస్తున్న వారు తలలు పట్టుకుంటున్నారట! ఈ టైటిల్‌తో బాగా పాపులర్ అయిన తరువాత టైటిల్ మారిస్తే ఫలితం తేడా కొట్టవచ్చని కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం వెబ్ సిరీస్ నిర్మాతలకు తలనొప్పే అంటున్నారు.
Be the first to comment