గురుపౌర్ణమి వేళ మాచర్లలో కలకలం.. సజీవ సమాధికి లచ్చిరెడ్డి యత్నం

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం గన్నవరంలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల లచ్చిరెడ్డి అనే వృద్ధుడు తాను సజీవ సమాధి అవుతానంటూ కలెక్టర్‌ అనుమతి కోరారు. ఈ మేరకు తన సొంత పొలంలో నేలమాళిగను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ కలెక్టర్ అనుమతి నిరాకరించడమే కాకుండా పోలీసులను పంపించి లచ్చిరెడ్డి ప్రయత్నాన్ని అడ్డుకునేలా చేశారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

లచ్చిరెడ్డి గత కొంత కాలంగా ఆధ్యాత్మిక భావనతో గడుపుతున్నారు. ఆధ్యాత్మిక ప్రభావంతో తాను సజీవ సమాధి అవ్వాలని నిర్ణయించుకున్నారు. పొలంలో మూడడుగుల నేలమాళిగను సిద్ధం చేసుకున్నారు. దానికి తలుపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతా రెడీ అయిన తర్వాత గుంటూరు కలెక్టర్ కర్యాలయానికి వెళ్లి తన సజీవ సమాధి ప్రయత్నానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే కలెక్టర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*