
తన పెళ్లిపై వచ్చిన వార్తలకు తమన్నా ఫైర్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనకు ఒక యాక్టర్‌తో ఎఫైర్ ఉందన్నారు, తర్వాత క్రికెటర్ అన్నారు, ఆ తర్వాత డాక్టర్ అన్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ పుకార్లను వింటుంటే తానేదే భర్త కోసం షాపింగ్ చేస్తున్నానేమో అనిపించిందని అన్నారు. ప్రేమ అనే భావన తనకు ఇష్టమే అయినప్పటికి, ఇలా నిరాధార ఆరోపణలు తనపై చేయడం సరికాదని ఆమె హితవు పలికారు.
ప్రస్తుతం తాను సింగిల్ ఉంటూ చాలా హ్యాపీగానే ఉన్నానని, తాను ప్రస్తుతం తన సినిమాలతోనే రొమాన్స్ చేస్తున్నానని చెప్పింది. తాను సినిమాలతో బిజీగా ఉంటే ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో తనకు అర్ధం కావడంలేదని వాపోయింది. తాను నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నట్టైతే స్వయంగా తానే ప్రపంచమంతటికి చెబుతానని, తాను పెళ్లి ప్రయత్నాలేమీ చేయడం లేదని స్పష్టం చేసింది. ఇక ఇక్కడితో ఈ పుకార్లకు తాను ఫుల్స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్టు తెలిపింది.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 27, 2018
Be the first to comment