కుమార్తె ఆత్మహత్యపై అన్నపూర్ణ ఏమన్నారంటే?

హైదరాబాద్: కీర్తి కుమార్తెకు కొద్ది రోజులుగా మాటలు సరిగా రావడం లేదని, పాపకు స్పీచ్ థెరపీ ఇస్తున్నామని అన్నపూర్ణ తెలిపారు. పాపకు ఇక మాటలు రావనుకుని కీర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని తెలిపారు. కొంతకాలంగా కీర్తికి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు.

ఈ తెల్లవారుజామున తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చి డోర్ పగలకొట్టామని అన్నపూర్ణ చెప్పారు. ఆమెను ఓదార్చడం ఎవ్వరి వల్లా కావడం లేదు.

అన్నపూర్ణకు పిల్లలు లేకపోవడంతో కీర్తిని దత్తత తీసుకుని మూడేళ్ల క్రితం వివాహం చేశారు. కీర్తి భర్త వెంకట కృష్ణ కర్ణాటక రాయచూర్ వాసి. అక్కడే ఫెడ్ కార్పోరేషన్ ఈఫ్ ఇండియాలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.

దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. నిద్రలేమితో కీర్తి బాధపడుతున్నారని సమాచారం. ఉదయం 8 గంటలకు కీర్తిని చూసిన భర్త పోలీసులకు సమాచారం ఇచ్చారు. కీర్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*