కరుణానిధి పరిస్థితి విషమం.. లక్షలాది మంది ప్రార్థనలు

డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. గత రెండు రోజులుగా మూత్ర నాళ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం రాత్రి హఠాత్తుగా బీపీ పడిపోయింది. దీంతో తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ఓ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు రక్తపోటు అదుపులోనే ఉందని కరుణ కుమార్తె కనిమొళి తెలిపారు.

కరుణానిధి ఆరోగ్యం విషమించిందని తెలిసినప్పటి నుంచి ఆయన ఇంటికి అభిమానులు క్యూకట్టారు. గోపాలపురంలోని ఓ చిన్న సందులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇంటికి లక్షలాదిగా అభిమానులు తరలి రావడంతో కిక్కిరిసిపోయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరుణ కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా కరుణ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*