ఐడియా నుంచి మరో నయా ప్లాన్.. రోజుకు 5జీబీ డేటా!

ఐడియా సెల్యులార్ నుంచి మరో సరికొత్త ఆఫర్ వచ్చేసింది. రోజుకు 5జీబీ డేటాను అందించే రూ.295 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌ను ల్యాంచ్ చేసింది. 42 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్యాక్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 5జీబీ డేటా లభిస్తాయి. వాయిస్ కాల్స్ విషయంలో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మించకూడదనే నిబంధన ఉంది. ఎయిర్‌టెల్ రూ.295 ప్లాన్‌కు పోటీగా ఈ ప్యాక్‌ను తీసుకొచ్చినట్టు జియో వర్గాలు తెలిపాయి.

ఎయిర్‌టెల్ రూ.299 ప్యాక్‌లో రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ 45 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. అయితే, ఈ ప్యాక్‌లో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. జియో రూ.251 రీచార్జ్‌లో 51 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది.

రూ.295 ఐడియా తాజా ప్యాక్‌లో రోజుకు 5జీబీ డేటా, వంద ఎస్సెమ్మెస్‌లు 42 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. అయితే, అపరిమిత వాయిస్ కాల్స్ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ రోజుకు 250 నిమిషాలకు మించకూడదు. వారానికి 1000 నిమిషాలు దాటకూడదు. అంతకుమించితే మాత్రం సెకనుకు పైసా చెల్లించాల్సి ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*