ఇక కాలేజీ విద్యార్ధులకు కూడా మధ్యాహ్న భోజన పథకం

తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నట్టే కాలేజీ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ పెట్టాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్, మోడల్ జూనియర్ కాలేజీలు, బీఈడీ, డీఈడీ కాలేజీల్లోని దాదాపు 5 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు.

 

భోజనం అత్యంత నాణ్యంగా, పౌష్టిక విలువలతో అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు మూడురకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిటీ అడిగింది. 1) ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావల్సిన సరుకులన్నీ అందిస్తే సరఫరా చేయడం. 2) సరుకులన్నీ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే సమకూర్చి భోజనం అందించడం 3) పులిహోర, బ్లాక్ రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జల వంటి విభిన్న తృణధాన్యాలతో కూడిన భోజనాన్ని అందించేలా ప్రతిపాదనలు ఇవ్వాలని అడిగింది.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అన్ని కాలేజీలకు సమయానికి భోజనం అందేవిధంగా కావల్సిన కిచెన్లు ఏర్పాటు చేసుకోవాలని, మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రులు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ తో పాటు కాలేజీలకు దగ్గరగా ఉన్న మెస్సులు, హోటళ్ల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించడంపై కూడా చర్చించి, ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెప్పించాలని నిర్ణయించారు. ఆగస్టు మూడో తేదీ మరోసారి సచివాలయంలో ఈ కమిటీ సమావేశం కావాలని, ఈ సమావేశానికి అక్షయపాత్ర ఫౌండేషన్ తగిన ప్రతిపాదనలతో రావాలని సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*