
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫేస్బుక్లో ఆసక్తికర కామెంట్ చేశారు. సుమంత్ అశ్విన్, మెగా డాటర్ నిహారిక జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ మూవీకి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ రోజే సినిమా రిలీజ్ అంటూ డైరెక్టర్ లక్ష్మణ్‌తో పాటు చిత్ర బృందం మొత్తానికి ప్రభాస్ తన విషెస్ తెలిపారు. టీం మొత్తానికి ఘనవిజయం దక్కాలని తాను ఆశిస్తున్నట్టు ప్రభాస్ చెప్పారు.
ఇప్పుడు ప్రభాస్ పట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్టిన కాసేపటికే బాగా షేర్ అవుతోంది. అంతకుముందు జూన్ 30న ఈ హ్యాపీ డేస్ మూవీ థియేటర్ ట్రైలర్‌ను కూడా ప్రభాస్ తన ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే అంతకుముందు ప్రభాస్‌కు, నిహారికకు పెళ్లి జరగబోతోందంటూ పలు పుకార్లు వచ్చిన సంగతి తెలిసందే.
https://www.facebook.com/ActorPrabhas/
This post is also available in : English
Be the first to comment