నాడు ప్రదీప్.. నేడు రాహుల్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్న సెలబ్రిటీలు..

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సింగర్ రాహుల్ సిప్లిగoజ్ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్‌లో చెక్ చేస్తే.. 175 ఎంజీ వచ్చింది. అయితే తాను తాగలేదు అని పోలీసులపై బూతులకు దిగాడు. అసలు చాలాసేపు తనను చెక్ చేయనీయలేదు. మీడియా ప్రతినిధుల సమయాన్ని కూడా వృధా చేశాడు. చివరకు చెక్ చేశాక అడ్డంగా దొరికిపోయాడు.

 

గతంలో ఇలాగే యాంకర్ ప్రదీప్ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పడు రాహుల్. నాడు యాంకర్ ప్రదీప్‌కు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అతడి లైసన్స్ కేన్సిల్ చేశారు. డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించడంతో పాటు ఫైన్ వేశారు. ఆ తర్వాత తనలా ఎవ్వరూ తాగి వాహనాలు నడపవద్దని యాంకర్ ప్రదీప్ వీడియో కూడా విడుదల చేశాడు.

అధికారులు రాహుల్ లైసన్స్ కూడా కేన్సిల్ చేస్తారా లేక మరేదైనా చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి. మెగా పవర్ స్టార్ నటించిన రంగస్థలంలోని మంగమ్మ మంగమ్మ పాట రాహుల్ పాడిందే. రాహుల్ పాడిన అనేక పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. యూ ట్యూబ్‌లో ఆయన పాటలకు సూపర్ గిరాకీ ఉంది. హిట్టింగ్స్ లక్షల్లో ఉంటాయి.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*