ప్రేమించిన వ్యక్తితో లేచిపోయానంటూ షాకిచ్చిన సమంత

ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే అక్కినేని సమంత తాజాగా ఒక ఆసక్తికర కామెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. గతవారం తాను లేచిపోయానని ఈ విషయం ఎలా బయటకు లీక్ అయ్యిందో తెలియడం లేదంటూ వాపోయింది. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, తాను ఆ వ్యక్తితో చూసిన మరుక్షణంలోనే ప్రేమలో పడిపోయానని సమయంత చెప్పింది.

ఇంతకీ ఏం జరిగిందంటే సమయంత అంటే విపరీతంగా ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు చాలా సార్లు సమంత పేరును ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ చిలిపి ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటిది ఒకటి జరిగింది. ఒక అభిమాని తన ఫోటో పక్కన సమంత ఫొటోను ఎడిట్ చేసి పెట్టాడు. ఇద్దరికీ మెళ్లో దండలు ఉండి అప్పుడే పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది ఆ ఫొటో. దాన్ని పోస్ట్ చేస్తూ సమంత పేరును ట్యాగ్ చేసి సమంత ఏంటిది? అని ప్రశ్నించాడు.

దీంతో సమంత కూడా తనపై అభిమానులకు ఉన్న ప్రేమను అర్ధం చేసుకుని అంతే చిలిపిగా సమాధానం చెప్పింది. తాను ఆ వ్యక్తితో చూసిన వెంటనే లవ్‌లో పడిపోయానని, గతవారమే లేచిపోయామని చెప్పింది. ఈ విషయం బయటకెలా వచ్చిందో తెలియడంలేదంటూ అమాయకంగా అడిగి అందరికీ షాకిచ్చి నవ్వించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*