
శాంసంగ్ సెక్యూరిటీస్ సీఈవో కూ సంగ్-హూన్ తన పదవికి రాజీనామా చేశారు. 105 బిలియన్ డాలర్ల ఉనికిలో లేని షేర్ల విషయంలో తప్పుదొర్లినందుకు గాను హూన్ తన పదవి నుంచి తప్పుకున్నట్ట కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2వేల మంది ఉద్యోగులకు 2.8 బిలియన్ల షేర్లను కేటాయించారు. నిజానికి వారికి 2.8 బిలియన్ కొరియన్ వన్ (కొరియన్ కరెన్సీ) కేటాయించాల్సి ఉండగా, షేర్లు కేటాయించడం వివాదాస్పదమైంది. తమకు కేటాయించిన షేర్లను కొందరు ఉద్యోగులు వెంటనే విక్రయించేశారు. అయితే, ఆ తర్వాత కంపెనీ ఒక్కొక్కరికీ 27 వేల డాలర్ల జరిమానా విధించింది.
మరోవైపు దక్షిణ కొరియా ఫైనాన్షియల్ వాచ్డాగ్ సంస్థ బ్రోకరేజ్ కార్యాకలాపాలపై ఆరునెలల పాక్షిక నిషేధం విధించింది. అలాగే, విధుల నుంచి సంస్థ చీఫ్‌ను మూడు నెలల పాటు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కూ హూన్ తన పదవికి రాజీనామా చేశారు.
Be the first to comment