కాపు రిజర్వేషన్‌పై జగన్ కీలక ప్రకటన

జగ్గంపేట: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమైన కాపు రిజర్వేషన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాపు రిజర్వేషన్ అంశం తన పరిధిలోనిది కాదని తేల్చి చెప్పేశారు. ఈ విషయం తనకు తెలుసు కాబట్టే హామీ ఇవ్వడం లేదన్నారు. తాను ఒకసారి మాట ఇస్తే దానిపై నిలబడతానని, నెరవేర్చలేని హామీలు ఇవ్వలేనని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కో కులానికీ ఒక్కో హామీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాడితే కుదరదని రిజర్వేషన్లు ఇక కుదరదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని జగన్ గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వస్తే మాత్రం కాపు రిజర్వేషన్లకు నిధులు రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ ప్రకటనపై కాపు రిజర్వేషన్ పోరాట నేత ముద్రగడ పద్మనాభం ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*