కుల్దీప్ కోసం అశ్విన్‌ను తప్పించొద్దు

లండన్: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆగష్టు 1 నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తుది జట్టులోకి ఇద్దరు స్పిన్నర్ల మధ్య పోటీ నెలకొంది. చైనామన్ బౌలర్ కుల్దీప్, స్పెషల్ స్పిన్నర్ అశ్విన్‌లలో ఒకరినే తీసుకునే అవకాశాలున్నాయి.

సీసీఐ ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో అశ్విన్, కుల్దీప్ అశ్విన్ ఉన్నారు. కానీ తుది 11 మందిలో ఆ ఇద్ధరినీ తీసుకోకపోవచ్చు. అందుకే మైక్ హస్సీ అశ్విన్‌కు మద్దతు పలికాడు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు మైక్ హస్సీ కీలకమైన కామెంట్ చేశాడు. భారత జట్టులో అశ్విన్‌కి బదులు కుల్దీప్ యాదవ్‌ను ఎంచుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ చాలా కాలంగా టీమిండియాకు ఆడుతూ రాణిస్తున్నాడని, అతని స్థానంలో కుల్దీప్‌ను తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో 300కి పైగా వికెట్లు సాధించాడని పైగా ఇంగ్లండ్‌ జట్టులో లెఫ్ట్ హ్యండ్ బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉన్నారని అశ్విన్ ఉంటే ఇండియన్ టీంలో పెద్ద పాత్ర పోషిస్తాడని హస్సీ చెప్పాడు.

 

తమిళనాడుకు చెందిన అశ్విన్ ఇప్పటి వరకూ 58 టెస్టులాడి 316 వికెట్లు తీశాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*