ప్రకాశం జిల్లాలో దారుణం.. ప్రియుడిని దారుణంగా చంపేసిన ప్రియురాలు..

పొదిలి: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కొనకనమిట్ల మండలం చౌటపల్లిలో పొదిలికి చెందిన హోంగార్డు షేక్ షబ్బీర్ పొదిలికే చెందిన షకీరాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న షబ్బీర్ మూడు నెలలుగా డ్యూటీకి డుమ్మా కొట్టి ప్రియురాలు షకీరాతో కలిసి కోళ్ల వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపార లావాదేవీల విషయంలో ఇద్దరికీ గొడవ ప్రారంభమైంది. గొడవలు ముదిరి షకీరాపై తరచూ చేయి చేసుకునేవాడు. దీంతో షకీరా ఎలాగైనా షబ్బీర్‌ను హతమార్చాలని పథకం వేసుకుంది.

షబ్బీర్ ఎప్పటిమాదిరిగానే తనను తాను మంచానికి గొలుసులతో కట్టించుకుని లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఇదే అదనుగా భావించిన షకీరా షబ్బీర్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టింది. మంటల ధాటికి గట్టిగా కేకలు వేయడంతో స్థల యజమాని ఘటనా స్థలానికి వచ్చాడు. అయితే మంచానికి గొలుసులతో కట్టేసి ఉండటంతో షబ్బీర్‌ను కాపాడలేకపోయాడు. మంటల్లో కాలిపోయిన షబ్బీర్ ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన షకీరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*