
తర్లుబాడు: ప్రకాశం జిల్లాలో మరో ఘోరం జరిగింది. తర్లుబాడు మండలం నాగేళ్ళముడుపు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ ఎవరు? ఈ దారుణానికి పాల్పడిందెవరు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
జిల్లాలో ఒకే రోజు జరిగిన రెండు సజీవ దహనాలు జరగడం కలకలం రేపుతోంది. కొనకనమిట్ల మండలం చౌటపల్లిలో పొదిలికి చెందిన హోంగార్డు షేక్ షబ్బీర్‌ను పొదిలికే చెందిన షకీరా పెట్రోల్ పోసి తగలబెట్టింది. వివాహేతర సంబంధంతో పాటు ఈ మధ్యే ప్రారంభించిన కోళ్ల వ్యాపారంలో విభేదాలు రావడంతో షకీరా ఈ దారుణానికి పాల్పడింది. తనను నిత్యం కొడుతుండటం వల్ల కూడా ఆమె పగ పెంచుకుని షబ్బీర్‌పై పెట్రోల్ పోసి హతమార్చింది. షబ్బీర్‌పై పెట్రోల్ పోసిన సమయంలో అతడి కాళ్లు, చేతులూ మంచానికి గొలుసులతో కట్టివేసి ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Be the first to comment