వెంకయ్య, నరసింహన్‌, నాగార్జునకు సవాల్ విసిరిన టీఆర్ఎస్ యువ ఎంపీ

హైదరాబాద్: టీఆర్‌ఎస్ యువ ఎంపీ, టీ న్యూస్ మేనేజింగ్ డైరక్టర్ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, సినీ హీరో అక్కినేని నాగార్జునకు సవాల్ విసిరారు. హరితహారం, గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సంతోష్ నేడు మూడు మొక్కలు నాటారు. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ కూడా చేపడతానంటూ ట్వీట్ చేశారు. ఫొటోలను కూడా జతచేశారు. ఆ తర్వాత ఈ సవాలు స్వీకరించాలంటూ వెంకయ్య, నరసింహన్, నాగార్జునను నామినేట్ చేశారు.

 

వాస్తవానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించినప్పటి నుంచీ ఇది వేగం పుంజుకుంది. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ రాధాకృష్ణ, సైనా నెహ్వాల్‌, రాజమౌళి, మహమూద్ అలీలను నామినేట్ చేశారు. తన ఛాలెంజ్‌ను స్వీకరించాలని, తనలాగే మొక్కలు నాటుతూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. నాటి నుంచీ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించినవారంతా మొక్కలు నాటుతూ పోతున్నారు. మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నారు. యజ్ఞం కొనసాగుతోంది.

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*