
చెన్నై: అనారోగ్యంతో చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకె అధినేత కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. కరుణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకయ్య వెంట కరుణానిధి కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి కూడా ఉన్నారు. రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచి కరుణ ఆరోగ్యంపై వాకబు చేశారు.
కావేరీ ఆసుపత్రి ఐసీయూలో ఎనిమిది మంది నిపుణుల బృందం కరుణను పర్యవేక్షిస్తోంది. 94 ఏళ్ల కరుణానిధి కొద్ది రోజులుగా జ్వరం, లో బీపీ, మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. అటు ఆసుపత్రి బయట డీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. కరుణ ఆరోగ్యం గురించి వాళ్లు ఆందోళన చెందుతున్నారు.
Be the first to comment