ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ దినేశ్ కార్తీక్‌కు చాలా స్పెషల్..

లండన్: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆగష్టు 1 నుంచి మొదలు కాబోతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్‌ దినేశ్ కార్తీక్‌కు వెరీ స్పెషల్. ఎందుకంటే చాలా కాలం తర్వాత దినేశ్ మళ్లీ కీపింగ్ చేయబోతున్నాడు. టెస్టుల్లో ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడంతో అతని స్థానంలో మరొకరు కీపింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ధోనీ ప్లేస్‌లో వృద్ధిమాన్ సాహా ఆడాల్సి ఉంది. కానీ అతను షోల్డర్ సర్జరీ కారణంగా అందుబాటులో లేకపోవడంతో సెలక్షన్ కమిటీ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసింది.

నిజానికి దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్‌గానే తన కెరీర్ ప్రారంభించాడు. కానీ ధోనీ టీమిండియా కీపర్‌గా బాగా క్లిక్ అవ్వడంతో దినేశ్‌కు అవకాశం రాలేదు.

పది సంవత్సరాల క్రితం 2007లో ఇంగ్లండ్ టూర్‌లో దినేశ్ కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా 1-0 తేడాతో గెలిచేందుకు కారణమయ్యాడు. అప్పుడు రాహుల్ ద్రావిడ్ సారధ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిగా ఆ జట్టులో ఉన్నవాళ్లలో ఒక్క దినేశ్ కార్తీక్ మాత్రమే మళ్లీ ఇప్పుడు ఆడుతున్నాడు.

ఈ నేపథ్యంలో దినేశ్ మాట్లాడుతూ తనకు చాలా నెర్వెస్‌గా, ఎక్సైట్‌మెంట్‌గా ఉందని చెప్పాడు. చాలా కాలం తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్‌లో ఆడబోతుండటం సంతోషంగా ఉందని, ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీస్ అంటే అదొక చాలెంజ్ అని అన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*