29-07-2018 నుంచి 04-08-2018 వరకు వారఫలాలు

మేష రాశి ….. ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుతాయి వాటికి సమయం ఇస్తారు. గతంలో మీరు చేపట్టిన పనులు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల నుండి వచ్చిన అనుభవాలు అలాగే సూచనలు పరిగణలోకి తీసుకోవడం అనేది మేలుచేస్తుంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో నూతన నిర్ణయాలు వారి సమ్మతం తెలుసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులకు లబ్దిని చేకూర్చిపెడతారు. మీయొక్క ఆలోచన తీరు కొంతమందిని ఆశ్చర్యపరుస్తుంది. దైవసంభందమైన పనులకు సమయం ఇవ్వడం అవసరం. కుటుంబంలో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. వ్యాపారపరమైన విషయాలో ఒక అడుగు ముందుకు పడుతుంది. అనవసరమైన ఖర్చులను దూరం చేసుకోవడం వలన మరింత లబ్దిని పొందుతారు. మానసికపరమైన ఒత్తిడి మాత్రం తప్పకపోవచ్చును యోగచేయుట వలన ఉపశమనం ఉంటుంది.

వృషభ రాశి ….. ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు రావడం అనేది సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు కాకపోతే అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది ఈ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. స్త్రీ పరమైన విషయాలలో సమయాన్ని అధికబాగం కేటాయించే అవకాశం ఉంది. వివాదాస్పదమైన వ్యాక్యలకు దూరంగా ఉండుట సూచన. కుటుంబంలో సభ్యుల యొక్క ఆలోచనలు మీకు పెద్దగా నచ్చకపోవచ్చును. దైవసంభందమైన విషయాలలో పాల్గొంటారు. గతకొంతకాలంగా పూర్తికాని లేదా ఫలితాలు వెలువడని విషయాల్లో అనుకూలమైన మార్పులకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి సరదగా సమయాన్ని గడుపుతారు వారితో కలిసి విందులలో అలాగే వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. విలువైన వస్తువులను కొనుగోలుచేయకండి.
మిథున రాశి …… ఈవారం మొత్తంమీద అధికారులతో నూతన పనులకు సంభందించి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సంతృప్తినిచ్చే ఫలితాలు రావడం అనేది ఊరట చెందు అంశం. విలువైన వస్తువులను కొనుగోలుచేస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది అనుకున్న పనులను పూర్తిచేయుట ద్వార నలుగురిలో గుర్తింపును పొందుతారు. స్వల్పదూరప్రయాణాలను ఇష్టపడుతారు. సంతానం మూలాన సమాజంలో గౌరవింపబడుతారు కాకపోతే వారిమూలన నూతన ఆలోచనలు చేయవలసి వస్తుంది. దైవసంభందమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది పూజల్లో పాల్గొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేపడుతారు ఆశించిన విధంగా మిత్రులనుండి సహకారం సమయానికి అందుతుంది. జీవితభాగస్వామితో కలిసి విందులలో పాల్గొనే అవకాశం ఉంది.

కర్కాటక రాశి …… ఈవారం మొత్తంమీద అనవసరమైన విషయాలకు సమయం ఇవ్వడం మూలాన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాల విషయంలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట మంచిది. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి నలుగురితో కలిసి పనిచేసే సమయంలో అందరిని కలుపుకొని వెళ్ళడం మంచిది. ప్రయాణాలు కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది వాటిని వాయిదా వేయుట మంచిది. స్వల్పఅనారోగ్యసమస్యలు తప్పకపోవచ్చును వైద్యసహాయం తీసుకోవాల్సి రావోచ్చును. పాజిటీవ్ దృక్పథం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో సాధారణ ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి …… ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. తలపెట్టిన పనులను అనుభవజ్ఞుల ప్రకారం ముందుకుతీసుకువెళ్ళుట చేత ఆశించిన ఫలితాలు కలుగుతాయి. కొన్ని కొన్ని విషయాలలో ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు కలుగుటకు ఆస్కారం కలదు. మిత్రులద్వార మానసికపరమైన సమస్యలు ఏర్పడుటకు అవకాశం కలదు వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోకండి. దూరప్రదేశ ప్రయాణాల విషయంలో ఒక అవగాహనకు వస్తారు వాటికి సమయం కేటాయించే అవకాశం కలదు. స్త్రీ సంభందమైన విషయాల్లో వారికి అనుగుణంగా నడుచుకొనుట మేలుచేస్తుంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. బంధువులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది వారినుండి నూతాన విషయాలు తెలుసుకుంటారు.

కన్యా రాశి …… ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి మీరు చెప్పేవిషయాలను తోటివారు మరోలా అర్థం చేసుకొనే అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు కష్టపది పనిచేయుట వలన సంతృప్తినిచ్చే ఫలితాలు కలుగుతాయి. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది వాటికి సమయం ఇవ్వడం ఉత్తమం. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు వాటిలో మీయొక్క పాత్ర అధికంగా ఉండే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి గతంలో చేపట్టిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో విలువైన వస్తువులను కొనుగోలుచేసే అవకాశం ఉంది అదేవిధంగా ఊహించిన దానికన్నా అధికంగా ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త. అనవసరమైన చర్చలకు ఆలాగే ప్రయాణాలకు సమయం ఇవ్వకపోవడం మంచిది.

తులా రాశి ……. ఈవారం మొత్తంమీద మీ ఆలోచనలే ఫలితాలను నిర్దేస్తిస్తాయి కావున మంచి ఆలోచనలు చేయుట అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట వాలన పనులను ఆలస్యంగా నైనా పూర్తిచేయగలరు. ప్రణాళిక లేకపోతే చిరాకును పొందుటకు అవకాశం ఉంది కావున చేసే పనుల విషయంలో స్పష్టత అవసరం. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సూచన. ప్రయాణాలు వాయిదా వేయుట ఉత్తమం లేకపోతే వాటిమూలన ఇబ్బందులను పొందుతారు. సంతానపరమైన విషయాల్లో మొదట్లో ఒత్తిడి పొందినను చివరినిమిషంలో ఆనిసర్డుబాటు అవడం అనేది ఊరట. ఆర్థికపరమైన విషయాల్లో లేదా వ్యాపారపరమైన విషయాల్లో కాస్త నిదానంగా ఫలితాలు వస్తాయి అలాగే పనులు నిదానంగానే ముందుకు సాగుతాయి. చాలావరకు వేచిచూసే దొరని మీకు అనుకూలిస్తుంది.

వృశ్చిక రాశి ……. ఈవారం మొత్తంమీద ప్రతిపనిలో నిదానం అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నూతన సమస్యలు పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో పనిభారం పొందుతారు గృహంలో మార్పులకు అవకాశం ఉంది లేదా గృహమార్పు ఉంటుంది. అనారోగ్యసమస్యలు పొందుతారు కావున ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. వ్యాపారపరమైన విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అనుభవజ్ఞుల సూచనలు సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇవ్వకండి. మాటపట్టింపులకు పోవడం వలన ఇష్టమైన వారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో సమయం గడిపే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట అనేది మిమల్ని కాపాడుతుంది అధికారులకు అనుగుణంగా మెలగండి.

ధనస్సు రాశి …… ఈవారం మొత్తంమీద కాస్త లాభాలు కాస్త ఇబ్బందులు. ఏ పనిపైనా పూర్తిస్థాయి ద్రుష్టి పెట్టకపోవడం వలన మిశ్రమఫలితాలను పొందుతారు. చర్చాసంభందమైన విషయాలకు సమయాన్ని వృధాచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు రాకుండా చేసుకోవడం అవసరం. సమయపాలన అలాగే తొటిఉద్యొగులతొ కలగోలుపు తనం అనేది అవసరం. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. రాజకీయ వ్యవహరాల పట్ల మక్కువను కలిగి ఉంటారు పెద్దలతో చర్చల్లో పాల్గొంటారు కాస్త ఈ విషయంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే వచ్చిన అవకశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నం ఉత్తమం. కుటుంబంలో తండ్రితరుపు వారి నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోండి.

మకర రాశి …… ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని పూర్తిచేసే దిశగా వెళ్ళుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండుటలో విఫలం చెందుతారు. కొన్ని కొన్ని మొండినిర్ణయాలు తీసుకోవడం మూలాన లేనిపోని సమస్యలు తెచ్చుకున్న వారు అవుతారు. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను తెలివితో ఎదుర్కొనే ప్రయత్నం చేయుట ఉత్తమం కోపం మూలాన నష్టపోతారు. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులకు మీయొక్క ఆలోచనలు తెలియజేయుట మంచిది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి వాటికి సమయం ఇవ్వడం అలాగే వాటికి సంభందించిన పనులను పూర్తిచేయుట ద్వార మేలుజరుగుతుంది. నలుగురితో సరదగా గడుపు ప్రయత్నం చేయండి.

కుంభ రాశి …… ఈవారం మొత్తంమీద తొందరాపాటు నిర్ణయాలు పనికిరావు వాటి మూలాన నలుగురికి సమాధానం చెప్పవలసి వస్తుంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనులు భారాన్ని కలిగి ఉన్నను మొత్తంమీద వాటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి స్వల్పదూర ప్రయాణాలకు సమయాన్ని ఇస్తారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు అలాగే మీ శక్తిని గుర్తెరిగి నడుచుకోవడం వలన మేలుజరుగుతుంది. మిత్రులతో సమయాన్ని గడుపుతారు, బాల్యస్మృతులను ఒకసారి నేమరువేసుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో రెండురకాల ఫలితాలు పొందుతారు ఒకసారి అధికలాభం అలాగే నష్టాన్ని చవిచూసే అవకాశం కలదు. స్త్రీ సంభందమైన విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం.

మీన రాశి …….. ఈవారం మొత్తంమీద అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది కావున చక్కటి ప్రణాళికతో ముందుకు వెళితే లబ్దిని పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో నూతన పనులను ఆరంభించే విషయంలో చర్చలు చేయుటకు అవకాశం కలదు అవి సత్ఫలితాలను కలుగజేస్తాయి. కుటుంబంలో పెద్దల నుండి నూతన విషయాలను సేకరిస్తారు. మీయొక్క ఆలోచనా దొరనని కొనమంది వ్యతిరేకించే అవకాశం ఉంది కావున కొన్ని కొని విషయాల్లో సర్దుబాటు అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు ఉంటవి రాబడికి తగిన ఖర్చులను కలిగి ఉంటారు. సంతానపరామైన విషయాల్లో వారికి ఎదోచేయాల్నే మీ తలంపులు కార్యరూపం దాల్చుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన విధానాలు ఆవలంభిన్సు అవకాశముంది సంతృప్తినిచ్చే ఫలితాలు పొందుతారు.

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466, 8985203559

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*