
చెన్నై: డీఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తమిళనాడు సీఎం పళని స్వామి చెప్పారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి ఆయన కరుణను పరామర్శించారు. కలైంజర్ కోలుకుంటున్నారని చెప్పారు. కావేరీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని సీఎం తెలిపారు.
కరుణానిధిని నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. కరుణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకయ్య వెంట కరుణానిధి కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి కూడా ఉన్నారు.
కావేరీ ఆసుపత్రి ఐసీయూలో ఎనిమిది మంది నిపుణుల బృందం కరుణను పర్యవేక్షిస్తోంది. 94 ఏళ్ల కరుణానిధి కొద్ది రోజులుగా జ్వరం, లో బీపీ, మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. అటు ఆసుపత్రి బయట డీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. కరుణ ఆరోగ్యం గురించి వాళ్లు ఆందోళన చెందుతున్నారు.
కార్యకర్తలు సంయమనం పాటించాలని స్టాలిన్ సూచించారు.
Be the first to comment