
కేటీఆర్ విసిరిన హరిత హారం చాలెంజ్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్వీకరించారు. ఈ సవాల్‌ను స్వీకరించేలా తనను నామినేట్ చేసినందుకు కేటీఆర్‌కు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు. పచ్చని వాతావరణం కోసం ఈ హరితహారం అనేది ఒక గొప్ప ప్రతిపాదన అని మహేశ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తన కూతురు సితారతో కలసి మొక్కను నాటి నీళ్లు పోసారు. ఈ మొక్కను నాటుతున్నప్పుడు తీసిన మూడు ఫోటీలోను ట్విట్టర్ షేర్ చేశారు. అయితే ఈ సందర్భంగా తాను తన కుమారుడు గౌతమ్, కూతురు సితారతో పాటు తన డైరెక్టర్ వంశీని ఈ సవాల్‌ను స్వీకరించేందుకు నామినేట్ చేశారు. కేటీఆర్ మహేశ్ బాబుతో పాటు వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్‌ను కూడా నామినేట్ చేశారు.
క్రికెటర్లిద్దరూ ఈ గ్రీన్ చాలెంజ్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. ఇలా ఒక్కొక్కరు గ్రీన్ చాలెజ్ను స్వీకరించి ముగ్గురు ముగ్గురు చొప్పున నామినేట్ చేస్తుండటంతో ఈ హరితహారం బాగా వైరల్ అవుతోంది. మహేశ్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Challenge accepted, @KTRTRS & @RachakondaCop ???? Thank you for nominating me…???? #HarithaHaram is a great initiative taken towards a go green environment. I now nominate my daughter Sitara, my son Gautam and my @directorvamshi to take on the challenge. pic.twitter.com/SEhcuM4Dgy
— Mahesh Babu (@urstrulyMahesh) July 30, 2018
This post is also available in : English
Be the first to comment