షామీర్ పేట చెరువుకు మహర్దశ

కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న షామీర్ పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండిఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెల రోజుల్లోగా షామీర్ పేటను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక రూపొందించి, పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా షామీర్ పేట చెరువుకు నిత్యం నీళ్లు అందుతాయని సీఎం అన్నారు.

 

 

షామీర్ పేట్ చెరువు ద్వారానే బస్వాపూర్ రిజర్వాయర్ కు నీరు అందుతుందన్నారు. అటు షామీర్ పేట చెరువు, ఇటు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయని, దీన్ని పర్యాటక శాఖ అద్భుత అవకాశంగా తీసుకోవాలని సూచించారు. షామీర్ పేట హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉన్నందున టూరిస్టులు ఎక్కువ వస్తారని సీఎం అభిప్రాయ పడ్డారు. పర్యాటకులు బస చేయడానికి అనువుగా కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చెరువు, కాలువల వెంట పూలచెట్లు పెంచాలని సూచించారు. ప్రధాన రహదారి, చెరువు కట్ట మధ్య నున్న ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*