
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో జగన్ మరోసారి కాపుల రిజర్వేషన్‌పై స్పందించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ యూ టర్న్ తీసుకునే అలవాటు మా ఇంటా వంటా లేదని అన్నారు.
కాపులను మోసం చేసింది చంద్రబాబేనని, ఎన్నికల ముందు ఓ మాట తర్వాత మరో మాట చెప్పింది చంద్రబాబేనని విమర్శించారు. మోసం చేసింది చంద్రబాబాబా? లేక ప్రశ్నిస్తున్న జగనా? అని యెల్లో మీడియాను అడుగుతున్నాను.
బాబుకు మద్దతివ్వాలని ఆరాటపడుతున్న కొంతమంది పెద్ద నాయకులని ప్రశ్నిస్తున్నాను అంటూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పరోక్షంగా ప్రశ్నించారు. ఐదేళ్లలో కాపులకు ఐదు వేల కోట్లు ఇస్తానన్న చంద్రబాబు ఇప్పటివరకూ రూ.1340 కోట్లు మాత్రమే ఇచ్చి మోసం చేయలేదా?
యూ టర్న్ తీసుకునే అలవాటు మా ఇంటా వంటా లేదు. బీసీల హక్కులు పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్ కి మేం మద్దతే అని మొదట నుంచి చెబుతున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని చంద్రబాబు ఎందుకు నెరవేర్చలేదు, రిజర్వేషన్లు ఇస్తామని బాబు హామీ ఇవ్వడం మోసం కాదా? అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామనడం మోసం కాదా? కాపుల ఉద్యమం తీవ్రతరం అయితే అప్పుడు కమీషన్ ఏర్పాటు చేశారు. చైర్మెన్ సంతకం లేకుండా ఆ కమీషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి తూతూ మంత్రంగా కేంద్రానికి పంపించడం మోసం కాదా అని జగన్ ప్రశ్నించారు.
Be the first to comment